తర్జాతీయ అత్యున్నత స్థాయి ప్రమాణాలతో రూపొందించిన హైదరాబాద్ మెట్రో... తరచూ మరమ్మత్తులకు గురవుతోంది. సాంకేతిక లోపాల కారణంగా మెట్రోలు... మధ్యలోనే నిలిచిపోతున్నాయి. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాల కారణంగా ఎల్బీ నగర్- మియాపూర్ మార్గంలో రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ఒక్కరోజు ముందు మాదాపూర్ లైన్లో నిలిచిపోయిన మెట్రో ట్రైన్... నేడు ఎల్బీనగర్ ఏరియాలోనూ నిలిచిపోయాయి. సాంకేతిక కారణాల వల్ల మెట్రోలు మధ్యలోనే నిలిచిపోవడం, స్టేషన్లో ఆగిన తర్వాత కూడా డోర్స్ ఓపెన్ కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్నిరోజుల కిందట విద్యుత్ కేబుల్ వైర్లు తెగిపడి, కూకట్పల్లి ఏరియాలో మెట్రో రైలు నిలిచిపోయింది.