హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : పబ్‌జీ వ్యసనంతో పిచ్చోడిలా మారిన యువకుడు

తెలంగాణ16:07 PM May 14, 2019

'పబ్‌జీ' వ్యవసనం మనుషులను పిచ్చోళ్లను చేస్తోంది. తాజాగా హైదరాబాద్ పాతబస్తీ వీధుల్లో పబ్ జీ ఆడుతూ ఓ యువకుడు పిచ్చోడిలా మారాడు. ఇతని వింత ప్రవర్తన చూసి స్థానికులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. చుట్టూ ఏం జరుగుతుందో గమనించకుండా గేమ్‌లో మునిగి తేలాడు. తుపాకీ కాల్చుతున్నట్లు, బుల్లెట్లు లోడ్ చేస్తున్నట్టు యాక్షన్ చేయడంతో స్థానికులు అతన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. తన లోకంలో తానే ఆడుకుంటున్న అతన్ని స్థానికులు ఆరా తీయగా.. నేను పిచ్చోడిని కాదు, పబ్ జీ ఆడుతున్నాను అని ఇంగ్లీషులో సమాధానమిచ్చాడు. నన్ను పిచ్చోడిగా పిలవవద్దు అని సూచించి, అక్కడి నుంచి ఒక భవనంపైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. యజమాని అడ్డుకుని కిందకి పంపించాడు. వీడియోను గమనిస్తే హైదరాబాద్ పాతబస్తీలో షూట్ చేసినట్లుగా కన్పిస్తోంది. ఇవ్వాళ ఉదయం నుంచి ఈ వీడియో వైరల్‌గా మరింది.

webtech_news18