HOME » VIDEOS » Telangana

Video : అమ్మో ఇంత మందా... చేప ప్రసాదం కోసం లక్షల మంది క్యూ

తెలంగాణ11:31 AM June 09, 2019

చేప ప్రసాదం కోసం వచ్చిన వారితో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ రద్దీగా మారిపోయింది. ఈసారి అంచనాలకు మించి ప్రజలు వచ్చారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచీ ఇచ్చే చేప ప్రసాదం తీసుకునేందుకు రెండ్రోజుల ముందు నుంచే ప్రజలు వచ్చి స్టే చేశారు. ఇలా వచ్చే వారి కోసం రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ల దగ్గర ప్రత్యేకంగా వాహనాలను అందుబాటులో ఉంచినా అవి సరిపోలేదంటున్నారు చాలా మంది. చేప ప్రసాదానికి అవసరమైన లక్షా 60వేల కొర్రమీను చేపల్ని తెలంగాణ జిల్లాల నుంచీ తెప్పించారు. చేపల పంపిణీ పనిలో 340 మంది ఉన్నారు. చేప పిల్లలు బతికి ఉండేందుకు ప్రత్యేక కోల్డ్ స్టోరేజీని ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకూ చేప మందు ప్రసాదం పంపిణీ జరగనుంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోని 36 కౌంటర్లలో ఈ ప్రసాదాన్ని ఇస్తున్నారు.

Krishna Kumar N

Top Stories