ఢిల్లీ అల్లర్ల విషయంలో సోషల్ మీడియాలో వచ్చే వీడియోలను నమ్మొద్దని కోరారు... హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (CP) అంజనీ కుమార్. ఢిల్లీ అల్లర్ల కారణంగా... హైదరాబాద్ పాతబస్తీని సందర్శించిన ఆయన... అక్కడి ప్రశాంత పరిస్థితులు చూసి చాలా హర్షం వ్యక్తం చేశారు. అందరూ కలిసి మెలిసి ఉండటం ఆనందంగా ఉందన్నారు. సోషల్ మీడియాలో పుకార్లను నమ్మొద్దని మరీ మరీ కోరారు.