హైదరాబాద్ బంజారాహీల్స్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్ నెంబర్ 12లో స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై ప్రయాణిస్తున్న మహిళ తలపై నుంచి బస్సు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన జనం ఒక్కసారిగా తాత్కాలిక బస్సు డ్రైవర్‌పై దాడికి దిగారు.