హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో వేరేగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయితే ఈ ట్రాఫిక్ లో అంబులెన్స్ ఒకటి ఇరుక్కుంది. దీంతో అందులో ఉన్న పేషెంట్ ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో తీవ్ర కలకలం రేపింది. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.