HOME » VIDEOS » Telangana

నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు... ఆనందంలో అన్నదాతలు..

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి.. ఈ వర్షానికి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు భారీ వర్షాలు లేవు. ఇప్పుడు కురిసిన వర్షానికి అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అది అలా ఉంటే జిల్లాలోని ఎడపల్లి మండల కేంద్రాల్లో భారీగా వర్షం కురవడంతో ఇండ్లలోకి వర్షపు నీరు చేరుతోంది. గ్రామ శివారు ప్రాంతాల్లో కెనాల్ ను మూసివేయడం వల్లనే నీరు ఇండ్లలోకి చేరుతుందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

webtech_news18

Top Stories