కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. బిచ్కుంద మండలం పెద్ద దేవాడ వాగు పొంగి ప్రవహించడంతో తాత్కాలికంగా నిర్మించిన వంతెన చూస్తుండగానే కొట్టుకుపోయింది. గత పదిహేను రోజుల క్రితం వర్షాలకు ఈ వంతెన తెగి రాకపోకలు నిలిచిపోవడంతో అధికారులు మరమ్మతులు చేశారు. వారం రోజుల పాటు రాకపోకలు సాగాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి వంతెన మరోసారి కొట్టుకుపోయింది. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి తయకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.