హైదరాబాద్ నగరంలో వరుసగా రెండో రోజు వర్షాలు కురిశాయి. శనివారం మధ్యాహ్నం నగరంలో పలు ఏరియాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు కారణంగా భారీగా ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఎల్బీనగర్ చింతల్ కుంటలోని అండర్ గౌండ్ దగ్గర భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.