హైదరాబాద్, పలుచోట్ల భారీ వర్షం కురిసింది. కొన్నిచోట్ల ఓ మోస్తరు వడగండ్ల వాన పడింది. బంజారాహిల్స్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, సికింద్రాబాద్, ప్యాట్నీ, బేగంపేట, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. తెలంగాణకు రాగల మూడు రోజులు వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.