హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: తెలంగాణ రాష్ట్రంలో భారీ వడగండ్ల వాన... భారీగా పంట నష్టం...

తెలంగాణ08:36 PM IST Apr 19, 2019

తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, కందికట్కూర్, ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాలతో పాటు కరీంనగర్ పట్టణం, సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, నర్సన్నపేట, కోహెడ మండలంలో భారీ వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పలు గ్రామాల్లో ఉరుములతో కూడిన వర్షం పడింది. తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి, మాదాపురం, ముల్కలపల్లిలో తీవ్ర వడగండ్ల వాన పడింది. వడగండ్ల వాన కారణంగా వేల ఎకరాల్లో పంట నాశనమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Chinthakindhi.Ramu