హైదరాబాద్‌లో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, పంజాగుట్ట, ఎర్రగడ్డ, కూకట్పల్లి, సికింద్రాబాద్, తార్నాక, నాచారం, ఈసీఐఎల్, బోయిన్పల్లి సహా చాలా చోట్ల భారీ వాన కురిసింది. సుమారు 6 గంటలకు పైగా వర్షం పడడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. పలు చోట్ల బైక్‌లు కొట్టుకుపోయాయి. మ్యాన్‌హోల్స్ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులపై భారీగా వర్షపు నీరు నిలవడంతో నగరమంతటా ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. దాంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. ఫ్లైఓవర్లపైనా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.