HOME » VIDEOS » Telangana

Video: బస్సులో బుల్లెట్ దిగింది...హైదరాబాద్‌లో తీవ్ర కలకలం

తెలంగాణ13:09 PM May 02, 2019

హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేగింది. ఆర్టీసీ బస్సులో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. పంజాగుట్ట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బస్టాప్‌లో బస్సు దిగే సమయంలో ఇరువురు ప్రయాణికుల మధ్య వాగ్వాదం జరిగింది. ఫుట్‌బోర్డు నుంచి దిగాలని అడిగినందుకు సఫారీ దుస్తులు ధరించిన ఓ వ్యక్తి కోపోద్రిక్తుడయ్యాడు. ప్రయాణికులను దూషిస్తూ జేబులో నుంచి గన్‌తీసి ఫైరింగ్ జరిపాడు. దాంతో బస్సు రూఫ్‌టాప్ నుంచి బుల్లెట్ బయటకు దూసుకెళ్లింది. కాల్పుల అనంతరం బస్సు డ్రైవర్ బస్సును ఆపకుండా వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఆ బస్సుతో పాటు దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి ఫిలింనగర్-మణికొండ వెళ్లే 47 రూట్ బస్సు (AP28Z4468)లో ఈ ఘటన జరిగింది. పట్టపగలు ఆర్టీసీ బస్సులో కాల్పులు జరగడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

webtech_news18

Top Stories