గాంధీ ఆస్పత్రిలో డాక్టర్లపై జరిగిన దాడిని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా ఖండించారు. ప్రాణాలకు తెగించి కరోనాపై పోరాడుతున్న డాక్టర్లపై దాడులు చేయడం హేయమైన చర్యని మండిపడ్డారు. అలాంటి వారినందరినీ అడవుల్లో షెడ్డు నిర్మించి.. అందులో బంధించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.