హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : లంచం తీసుకోను... అనే బోర్డు పెట్టుకున్న ఆఫీసర్

తెలంగాణ11:05 AM November 19, 2019

Telangana : రంగారెడ్డి జిల్లా... అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహనం ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ హత్య నేరమే అయినా... చాలా మంది దీన్ని ప్రేరణగా తీసుకొని... తమను లంచం అడిగితే చంపుతామని అధికారులకు వార్నింగ్ ఇస్తున్నారు. అధికారులు కూడా తమపై ఎక్కడ దాడి చేస్తారోననే భయంతో... లంచం అడిగేందుకే భయపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విజయారెడ్డి హత్య... తెలంగాణలో రెవెన్యూ శాఖను కుదిపేసింది. పనుల కోసం వచ్చేవాళ్లు ఎవరు ఎలా ప్రవర్తిస్తారో అనే భయం ఉద్యోగులను పట్టుకుంది. ముందు జాగ్రత్త చర్యగా కొంతమంది అధికారులు తమను తాము రక్షించుకునే పనిలో పడ్డారు. ఈ భయం ఏపీలో కూడా పెరుగుతోంది. కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మార్వో... తనపై దాడి జరగకుండా ముందుగానే తన చాంబర్‌లో తన టేబుల్‌కు ముందు అడ్డంగా ఓ తాడు కట్టించుకున్న విషయం మనకు తెలుసు. తాజాగా మరో ప్రభుత్వ అధికారి "నేను లంచం తీసుకోను" అని పెద్ద అక్షరాలతో తన ఆఫీసులో బోర్డు పెట్టించుకున్నారు. కరీంనగర్ ఎలక్ట్రిసిటీ సర్కిల్ ఆఫీసులో కమర్షియల్ ఏడీఈగా పనిచేస్తున్న పోడేటి అశోక్ తన కార్యాలయంలో ఇలా బోర్డు రాయించి పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. అందరూ నిజాయతీగా పనిచేస్తే అవినీతి రహిత వ్యవస్థ రూపుదిద్దుకుంటుందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ బోర్డు ఫొటో... సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయా రెడ్డి హత్య... చివరకు ఇలా అధికారులు బోర్డులు పెట్టుకునే పరిస్థితి వచ్చేలా చేసిందని నెటిజన్లు అంటున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading