కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుధ్య కార్మికులకు పూర్తి జీతంతో పాటు, అదనంగా ప్రతి పారిశుధ్య కార్మికునికి ప్రోత్సాహకం కింద రూ.7500 ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం తీసుకున్న ఈ నిర్ణయంపై పారిశుధ్య కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.