ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు 24 గంటల స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ సూచించారు. కుటుంబసభ్యులతో కలసి ఆయన జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించి వైద్య సేవలు అందిస్తున్నామని, ఇళ్లనుంచి ఎవరు బయటకు రావొద్దని సూచించారు.