HOME » VIDEOS » Telangana

Video: ఆదిలాబాద్‌లో విషాదం..పాచిపోయిన పెళ్లి భోజనం తిని ముగ్గురు మృతి

తెలంగాణ22:24 PM May 08, 2019

పెళ్లింట మిగిలిపోయిన భోజనాలు ఆ ఊరిలో విషాదాన్ని నింపాయి. పాచిపోయిన ఆహారం తిని ముగ్గురు చిన్నారులు చనిపోయారు. మరో 22 మంది అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం కోత్తపల్లి కోలంగూడలో ఈ విషాదం చోటుచేసుకుంది. పాచిపోయిన ఆహారం తినడం వల్లే వారు చనిపోయారని డాక్టర్లు తెలిపారు. మృతులను ముత్తు (1), లక్ష్మణ్(4), భీం బాయి(6)గా గుర్తించారు. బాధితులు ఊట్నూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

webtech_news18

Top Stories