హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : కౌన్సిలర్‌పై హత్యాయత్నం... జగిత్యాలలో తీవ్ర కలకలం

తెలంగాణ10:08 AM April 17, 2019

Telangana News : జగిత్యాలలోని కృష్ణానగర్‌లో అర్థరాత్రి కౌన్సిలర్‌పై జరిగిన హత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 15వ వార్డు కౌన్సిలర్ శ్రీనుపై కత్తులతో దాడి చేశారు ఐదుగురు దుండగులు. నిద్రలో ఉన్న ఆయనపై ఒక్కసారిగా అన్ని కత్తులు దూసుకొచ్చేసరికి ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే... ఆయన తీవ్ర గాయాలపాలయ్యారు. కలకలం రేగడంతో దుండగులు పరారయ్యారు. కుటుంబ సభ్యులు ఆయన్ని చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కౌన్సిలర్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. పాత కక్షల తోనే ఈ దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Krishna Kumar N