నిజామాబాద్ జిల్లాలో మొదటి కరోనా వైరస్ నమోదు కావడంలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారు నగరంలోని ఖిల్లా ప్రాంతంలో తిరిగినందున ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్ రాకుండా సోడియం హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేయడం జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇంటింటికి సర్వేకు వచ్చిన డాక్టర్లు,నర్సులపై ఆ ప్రాంతంలోని ఓ వర్గం వారు అడ్డుకున్నారు.