హైదరాబాద్... ముషీరాబాద్‌లోని మారుతీ కార్ల షోరూం. ఉన్నట్టుండి అక్కడ మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. అది హైదరాబాద్... ముషీరాబాద్‌లోని మారుతీ కార్ల షోరూం. ఉన్నట్టుండి అక్కడ మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. మంటలు రావడంతో... చుట్టుపక్కల వాళ్లు హడలిపోయారు. ఏం జరిగిందో అంటూ అంతా మారుతీ కార్ల షోరూం వైపు చూశారు. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతూ కనిపించాయి. అమ్మో అమ్మో అంటూ అందరూ... ఫైర్ సిబ్బందికి కాల్ చేశారు. వాళ్లు కూడా నిద్రలో ఉన్నవాళ్లు కాస్తా లేచి... హడావుడిగా బయల్దేరారు. త్వరగానే చేరుకొని మంటల్ని అదుపుచేసేందుకు నానా తిప్పలు పడ్డారు. మొత్తం 4 ఫైర్ ఇంజిన్లతో అష్టకష్టాలు పడి మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఐతే... అప్పటికే కార్ల షోరూంలోని 7 కార్లు పూర్తిగా తగలబడిపోయాయి.