సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ప్రజ్ఞాపూర్‌లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. కాగా, ఈ రోజు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్న మంత్రి.. సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జాతీయ రహదారులపై సమీక్ష నిర్వహించనున్నారు. అదే విధంగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరుకానున్నారు.