హైదరాబాద్లో పావురాల సంఖ్య పెరుగుతుండటానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. వాటిని చాలా మంది ఇష్టంగా పెంచుకుంటున్నారు. వాటికి ప్రత్యేకంగా ఆహారం కొని వేస్తున్నారు. ఇలా హైదరాబాద్ పరిసరాల్లో చాలా చోట్ల పావురాల ఫీడింగ్ ప్రదేశాలున్నాయి. హైదరాబాద్‍లో పావురాలు 15 రకాల వ్యాధులు వ్యాపించేందుకు కారణం అవుతున్నాయి.చాలా విదేశాల్లో పావురాల పెంపకంపై నిషేధం ఉంది. దీంతో హైదారబాద్‌లో పావురాలకు దాణా వేయకండి అంటూ జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు.