HOME » VIDEOS » Telangana

Video : పొలాల్లో గాడిదలే దిక్కు... రైతుల దయనీయం

తెలంగాణ12:41 PM November 24, 2019

మన తెలుగు రాష్ట్రాల్లో రైతులకు ఎప్పుడూ కష్టాలే. కామారెడ్డి జిల్లాలో అకాల వర్షాలతో పంట పొలాలు నీట మునిగాయి. దాంతో రైతులు... ధాన్యాన్ని తరలించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అందుకు ఎలాంటి రవాణా సదుపాయాలూ లేకపోవడంతో... గాడిదలపైనే ఆధారపడుతున్నారు. ప్రతీ సంవత్సరం లాగానే ఈసారీ... నారాయణ ఖేడ్‌కు చెందిన గాడిదల యజమానులు ధాన్యాన్ని తరలించేందుకు గాడిదలను తీసుకుని జిల్లాకు వచ్చారు. ఒక్కో గాడిదా 70 నుంచి 80 కేజీల బరువున్న ధాన్యాన్ని మోసుకొస్తున్నాయి. నారాయణ్ ఖేడ్ నుంచి బతుకుదెరువు కోసం గాడిదలతో వచ్చి వరి ధాన్యాన్ని తరలిస్తూ ఉపాధి పొందుతున్నామని గాడిదల యాజమాని రంగయ్య తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం బర్రెలు, గొర్రెలు సబ్సిడీలో ఇచ్చినట్లుగా గాడిదలు కూడా సబ్సిడీ ద్వారా అందివ్వాలని వారు కోరుతున్నారు.

webtech_news18

Top Stories