హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : రెవెన్యూ అధికారిపై పెట్రోల్ పోసిన రైతు

తెలంగాణ17:29 PM November 19, 2019

తెలంగాణలో మరో రెవెన్యూ అధికారిపై పెట్రోల్ దాడి జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు. భూ సమస్య పరిష్కరించడం లేదని ఆగ్రహించిన రైతులు రెవిన్యూ సీనియర్ అసిస్టెంట్ పై పెట్రోల్ పోసిన సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. చిగురుమామిడి తాసిల్దార్ కార్యాలయంలో మంగళవారం లంబాడి పల్లి గ్రామానికి చెందిన రైతు కనకయ్య వెళ్లాడు. సీనియర్ అసిస్టెంట్ రామచంద్రన్ పై పెట్రోల్ పోసి హల్చల్ చేశాడు.అక్కడున్న కంప్యూటర్లపై కూడా పెట్రోల్ పోశాడు. దీంతో అక్కడున్న రెవెన్యూ సిబ్బంది అలర్ట్ అయ్యి కనకయ్యను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు సమాచారం అందించి అప్పగించారు. అయితే తన భూమి సమస్య పరిష్కరించడం లేదనే... అలా అధికారులపై పెట్రోల్ పోసానని కనకయ్య చెబుతున్నారు.

webtech_news18