వనపర్తి జిల్లా పెబ్బేరు మండల తహసీల్దార్ కార్యాలయంలో కలకలం చెలరేగింది. తన వంశపారంపర్యంగా వచ్చిన భూమిని సర్వే చేయండి అని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ సంవత్సరం నుండి ప్రదక్షిణలు చేస్తున్నా ఇప్పుడు అప్పుడు అంటూ అధికారులు కాలయాపన చేస్తూ వచ్చారు. గురువారం సర్వే చేస్తున్న సర్వేయర్ కు తహసీల్దార్ ఫోన్ చేయటంతో సర్వే చేయకుండా వెనక్కి రావటంతో మనస్తాపానికి గురైన ఆంజనేయులు తహసీల్దార్ కార్యాలయం వద్ద పురుగుల మందు తాగడానికి ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు. ఆందోళన చెందిన రైతు ఈ తహసీల్దార్ ఉన్నంత వరకు నా భూమి నాకు రానివ్వకుండా అడ్డుపడుతుంది. అంటూ వెంట తెచ్చుకున్న పెట్రోలుతో నేరుగా తహసీల్దార్ చాంబర్ లో పెట్రోలు పోసుకుని అంటించుకుంటుండగా కార్యాలయ సిబ్బంది, తదితరులు కుండలో నీరు పోసి రక్షించారు.