అమాయకులను మోసం చేస్తూ, డబ్బు సంపాదించే ముఠాను రామగుండం సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి ప్రవీణ్ అనే వ్యక్తి పరిపోగా, పోలీసులు కారును ఆపి అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులను విచారించగా నకిలీ బంగారం విక్రయిస్తున్న ముఠా గా గుర్తించినట్లు అడిషనల్ డిసిపి అశోక్ కుమార్ తెలిపారు. కర్ణాటకకు చెందిన ప్రవీణ్ మరో ముగ్గురుతో కలిసి ఓ ముఠాగా ఏర్పడి తమ వద్ద తవ్వకాల్లో దొరికిన బంగారం ఉందని తక్కువ ధరకే విక్రయిస్తూన్నామంటూ అమాయకులకు ఫోన్ చేసి వారి వద్ద నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసేవారని ఆయన చెప్పారు. వీరి వద్ద నుండి నకిలీ బంగారం తో పాటు కారు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.