Diego Maradona: దివంగత ఫుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనాకు చెందిన ఖరీదైన వాచ్ దుబాయ్ మ్యూజియం నుంచి చోరీకి గురైంది. అయితే సదరు వాచ్‌ను అక్కడే సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న వాజిద్ హుస్సేన్ దొంగిలించి అస్సాంకు తీసుకొని వచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులోనికి తీసుకున్నారు.