అధునాతన టెక్నాలజీతో నగరంలోని చెరువులు, నాలాల సుందరీకరణ పనులు చేపడుతున్నామని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. మియాపూర్ గుర్నాధం చెరువులో దోమల నివారణకు డ్రోన్ టెక్నాలజీతో యాంటీ లార్వా మందు పిచికారీ పనులను జీహెచ్‌ఎంసీ చేపట్టింది. ఈ కార్యక్రమానికి మేయర్‌తోపాటు ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లు మేక రమేష్, నాగేందర్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ.. సిబ్బందికి వీలుకాని చోట డ్రోన్‌లతో మందుల పిచికారీ, గుర్రపు డెక్క తొలగింపునకు డ్రోన్ టెక్నాలజీ వాడుకుంటున్నామని తెలిపారు.