కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్, కర్ఫ్యూ లను అమలు పరుస్తున్నారు. కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలోని పరిస్థితులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ముందుకు సాగుతూ పటిష్టంగా అమలు చేస్తున్నారు.
ఒక వైపు డ్రోన్ కెమెరా లను వినియోగిస్తూ మరోవైపు కమాండ్ కంట్రోల్ వాహనం ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ జనం గుంపులుగుంపులుగా ఉండే ప్రాంతాలను గుర్తిస్తూ ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారం అందిస్తూ అక్కడ ఉన్నవారిని చెదరగొట్టడం జరుగుతున్నది.