సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఓ బాలుడిపై కుక్క దాడి చేసి గాయపరిచింది. మదీనాగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అతడికి చికిత్స అందించారు. ఫిబ్రవరి 5న ఈ ఘటన జరిగింది. కుక్క దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.