ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ప్రకాశం జిల్లాకు చెందిన ఓ గర్భిణీకి హుజురాబాద్ ఏరియా ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. దాదాపు రెండు గంటల పాటు శస్త్రచికిత్సను విజయవంతంగా చేసి తల్లీబిడ్డలిద్దరినీ కాపాడారు. సదరు వైద్య బృందాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అభినందించారు.