నిర్భయ దోషులను జనవరి 22న ఉరి తీయాలని డెత్ వారెంట్ జారీ కావడంపై దిశా తండ్రి హర్షం వ్యక్తం చేశారు. వారిని ఉరి తీసే రోజును దీపావళిలా సెలబ్రేట్ చేసుకుంటానని చెప్పారు. ఘటన జరిగిన 7 ఏళ్ల తర్వాత నిర్భయకు న్యాయం జరిగిందని.. సత్వర న్యాయం లభించేలా చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.