ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా సన్నిధికి భారీ సంఖ్యలో భక్తులు తరలివెళ్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి మెస్రం వంశీయులు మహా పూజలు చేసి నాగోబాను ప్రారంభించారు. అప్పటి నుంచీ నాగోబాను దర్శించుకునేందుకు భక్తులు వస్తున్నారు. శనివారం తెల్లవారుజామున భేటింగ్ కోడళ్లు సత్తీక్ దేవతకు పూజలు చేసి సహపంక్తి భోజనాలు చేశారు. మెస్రం వంశీయుల్లో మగవారిని పెళ్లి చేసుకున్న కొత్త కోడళ్లు నాగోబా దేవత సన్నిధిలో భేటింగ్ అవుతారు. 22 తెగలకు చెందిన కొత్త కోడళ్లందరికి కుల దేవతను పరిచయం చేసే కార్యక్రమమే భేటింగ్. ఈ నెల 31 వరకు జాతర జరుగుతుంది.