HOME » VIDEOS » Telangana

Video: మోకాల్లోతు వరదలో మృతదేహం తరలింపు.. మంచం సాయంతో..

తెలంగాణ22:56 PM September 20, 2019

అంతరిక్షంలోకి సునాయాసంగా వెళుతున్న ఈ రోజుల్లో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారు మూల పల్లెలకు వెళ్లాలంటే మాత్రం తిప్పలు తప్పడం లేదు. సరైన రవాణా సౌకర్యం లేక, వాగులపై వంతెనలు లేక అత్యవసర పరిస్థితుల్లో నరక యాతన అనుభవిస్తున్నారు పల్లె ప్రజలు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గుబిడి గ్రామస్థులకు ఇదే పరిస్థితి ఎదురైంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చనిపోయిన మౌనిక అనే బాలిక మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లలేకపోయారు. వాగు ఉప్పొంగి ప్రవహించడంతో అంబులెన్స్ సిబ్బంది ఒడ్డునే వదిలిపెట్టి వెళ్లిపోయారు. దిక్కుతోచని స్థితిలో కరింజి, గుబిడి గ్రామస్థుల సహాకారంతో మృతదేహాన్ని మంచంపై ఉంచి మోకాలి లోతు నీటిలో వాగు దాటి గ్రామానికి చేర్చారు.

webtech_news18

Top Stories