హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : తండ్రి మరణం తట్టుకోలేక గోదావరిలో దూకిన కూతురు..

తెలంగాణ22:41 PM February 18, 2020

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన తండ్రి మరణం తట్టుకోలేక కూతురు గోదావరి నదిలో దూకింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగానగర్ గోదావరి బ్రిడ్జి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు కు చెందిన అరవెల్లి వసంతం సోమవారం రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కాగా వసంతం మృతదేహాన్ని వాహనంలో తీసుకెళ్తుండగా, కుటుంబ సభ్యులతో కలిసి మరో కారులో వెళ్తున్న వసంతం కూతురు ఆరవెల్లి. సాయి ప్రియ (32) వాంతులు వస్తున్నాయి అనడంతో గోదావరి బ్రిడ్జివద్ద కారు ఆపగా కిందికి దిగి గోదారిలో దూకి గల్లంతయింది.

webtech_news18