కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ అమలు తీరును కరీంనగర్ పోలీసు కమిషనర్ విబి కమలాసన్‌రెడ్డి ప్రత్యక్ష్యంగా డ్రోన్ కెమెరాల ద్వారా శనివారం పరిశీలించారు. లాక్డౌన్ విధుల్లో ఉన్న పోలీసులు తీరు, అక్కడ వారికి ఎదురవుతున్న సమస్యలను సైతం తెలుసుకున్నారు. నిబంధనలను ప్రతిఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని కోరారు.