తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, వ్యాధి నివారణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. కరోనా పోరాటంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై ప్రశంసించారు.