సంగారెడ్డిలో ఆరుగురికి కరోనా పాజిటివ్ రావడంతో మంత్రి హరీష్ రావు అప్రమత్తమయ్యారు. వెంటనే సంగారెడ్డికి వెళ్లి కలెక్టర్‌తో సమీక్ష నిర్వహించారు. అనంతరం
నారాయణ IIT అకాడమీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు వెళ్లారు. అక్కడ ఉన్న 43 మంది మర్కజ్ కరోన బాధితుల కుటుంబ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఢిల్లీకి వెళ్లొచ్చిన వారు దయచేసి సహకరించాలని ఉర్దూలో విజ్ఞప్తి చేశారు. అజ్బర్వేషన్లో ఉంచేందుకు ఇక్కడికి తీసుకొచ్చామని.. పరీక్షల్లో కరోనా నెగెటివ్ వస్తే తిరిగి ఇంటికి పంపిస్తామని తెలిపారు. ఒకవేళ పాజిటివ్ వస్తే గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తామని చెప్పారు.