కరోనా వైరస్ మన దేశానికి వ్యాప్తి చెందకూడదని.. చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చైనాలో మరణమృదంగం మోగిస్తున్న కరోనా వైరస్ మన దేశానికి రాకుదని బాలాజీని మొక్కుకున్నట్లు ఆయన తెలిపారు.