హైదరాబాద్ హైటెక్ సిటీలో కరోనా కలకలం రేపుతోంది. మైండ్ స్పేస్ సముదాయంలోని ఓ కంపెనీ ఉద్యోగికి కరోనా లక్షణాలు ఉన్నట్టు అనుమానం రావడంతో... కంపెనీ ప్రతినిధులు ఉద్యోగులను ఇంటికి వెళ్లిపోవాలని సూచించారు. రెండు వారాల క్రితం ఇటలీ నుంచి వచ్చిన ఉద్యోగికి కరోనా లక్షణాలు ఉన్నట్టు కంపెనీ ప్రతినిధులు గుర్తించారు. దీంతో ఉద్యోగులను ఇంటికి వెళ్లిపోవాలని తెలిపిన కంపెనీ ప్రతినిధులు... వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సూచించారు. మైండ్ స్పేస్‌లోని అనేక కంపెనీలు సైతం ఉద్యోగులను ఇంటికి పంపించి... వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చినట్టు తెలుస్తోంది.