కరోనా వైరస్ రోజు రోజుకు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కామారెడ్డి జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. ప్రధానంగా బాన్సువాడ పట్టణంలో తొమ్మిది పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కంటైన్మెంట్ ప్రాంతాలుగా ప్రకటించారు. ఆయా కాలనీల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి జనసంచారం లేకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.