Telangana Cooperative Elections 2020 : తెలంగాణలో సహకార సంఘాల ఎన్నికలు కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగుతున్నాయి. సూర్యాపేటలో టీఆర్ఎస్ నేత వెంకన్నను ప్రత్యర్థులు శుక్రవారం అర్థరాత్రి హత్య చెయ్యడంతో... సహకార సంఘ ఎన్నికలకు పోలీసులు భారీ భద్రత కల్పించారు. సహకార సంఘ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లలో భాగంగా కార్యకర్తలతో మాట్లాడుతున్న వెంకన్నపై ప్రత్యర్థులు దాడిచేసి కత్తులు, గొడ్డళ్లతో వెంబడించి మరీ చంపడం తీవ్ర కలకలం రేపింది. ఈ పరిస్థితుల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ భద్రతా చర్యల మధ్య జరుగుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. సాయంత్రం ఫలితాలు విడుదలవుతాయి.