సికింద్రాబాద్‌లో కూల్ డ్రింక్స్ లోడ్‌తో వెళ్తున్న ఒక కంటైనర్ లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. అందులో ఉన్న కూల్ డ్రింక్స్ బాటిళ్లు కింద నేలపై చెల్లాచెదరుగా పడ్డాయి. ఆదివారం అర్ధరాత్రి ఈ సంఘటన జరగ్గా...కూల్ డ్రింక్స్ బాటిళ్ల కోసం స్థానికులు ఎగబడ్డారు. కూల్ డ్రింగ్స్ బాటిళ్లను తమ వెంట ఎత్తుకెళ్లారు. ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు కూడా కూల్ డ్రింక్స్ బాటిళ్లను తీసుకెళ్లారు.