శేరిలింగంపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి. పాకిస్థాన్ నుంచి వచ్చినా ఎలాంటి మీరు భయపడాల్సిన అవసరం లేదని, మీకు మేము అండగా ఉంటామంటూ ఓ వర్గానికి చెందిన వ్యక్తులనుద్దేశించి మాట్లాడుతూ అరికెపూడి గాంధీ వ్యాఖ్యలు చేశారు. సీఏఏ, ఎన్నార్సీలో భాగంగా తమ సమాచారం ఇవ్వాలని ఎవరైనా వస్తే వారిని తరిమికొట్టండని ఎమ్మెల్యే వ్యాఖ్యానించడంపై బీజేపీ నేత తీవ్రంగా తప్పుబట్టారు.దీనికి సంబంధించి ఆయనపై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.