ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు నైట్ డ్యూటీలు వేయొద్దని యాజమాన్యాన్ని ఆదేశించారు సీఎం కేసీఆర్. రాత్రి 7.30 నుంచి 8.30 లోగా మహిళా ఉద్యోగుల డ్యూటీలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. 'దిశా హత్య అత్యంత దారుణమైన, అమానుషమైన దుర్ఘటన. రాత్రి సమయంలో ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు డ్యూటీలు వేయవద్దు. మాన మృగాలు మనమధ్యే తిరుగుతున్నాయి’ అని సీఎం కేసీఆర్ అన్నారు.