హోమ్ » వీడియోలు » తెలంగాణ

సివిల్స్‌లో 695వ ర్యాంకు సాధించిన శశికాంత్..ఈ విజయం అమ్మ నాన్నలదే

తెలంగాణ16:17 PM April 08, 2019

సివిల్స్ ర్యాంకుల్లో తెలుగు విద్యార్థుల హవా నడుస్తోంది..రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన శశికాంత్.. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో సత్తా చాటారు. శశికాంత్ 695వ ర్యాంకు సాధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 40 మంది ఎంపికైనట్లు ప్రాథమిక సమాచారం. మూడు దశల్లో జరిగే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో గత ఏడాది జూన్ 3న జరిగిన మొదటి దశ ప్రాథమిక పరీక్షలకు దేశవ్యాప్తంగా 3 లక్షల మందికిపై హాజరయ్యారు.  రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 39 వేల మంది ప్రాథమిక పరీక్షలు రాయగా, అందులో దాదాపు 500 మంది ప్రధాన పరీక్షలకు అర్హత పొందారు. వారిలో 75 మందికిపైగా మౌఖిక పరీక్షకు ఎంపికకాగా చివరకు 40 మంది విజేతలుగా నిలిచారు.

webtech_news18