HOME » VIDEOS » Telangana

Video: ఆరు నెలల్లో కరోనాకు మందు.. న్యూస్18తో IICT డైరెక్టర్

తెలంగాణ19:47 PM March 18, 2020

హైదరాబాద్‌లో కరోనావైరస్‌కు విరుగుడు మందు తయారవుతోంది. ఫెవిపిరవిర్‌ (Favipiravir), రెమిడెస్‌విర్ (Remidisivir), బెలాక్సివిర్ (Bolaxavir) కరోనావైరస్‌కు విరుగుడుగా పనిచేయగలవని IICT, సిప్లా సంస్థలు ప్రాథమిక అంచనాకు వచ్చాయి. ఈ మూడు రసాయనాలు వైరస్‌లను నిరోధించేందుకు సమర్థంగా ఉపయోగపడతాయని ఐఐసీటీ శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. ఐతే వాటిని పారిశ్రామిక స్థాయిలో తయారు చేసి ఇస్తే తాము టాబ్లెట్లు, ఇంజెక్షన్లు తయారు చేసి అందుబాటులోకి తెస్తామని సిప్లా కంపెనీ ప్రతిపాదించింది. ఈ డ్రగ్స్‌పై క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తయ్యాయని IICT డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఐతే వేర్వేరు కారణాల వల్ల ఇవి మార్కెట్‌లోకి రాలేదని.. ఐతే అత్యవసర పరిస్థితుల్లో నేరుగా ఉపయోగించే అవకాశం ఉంటుందని చెప్పారు.

webtech_news18

Top Stories