గతకొన్ని నెలల హైడ్రామాకు తెరదించుతూ 2012నాటి నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో నలుగురు దోషులను తీహార్ జైల్లో ఉరితీశారు. ఇవాళ ఉదయం 5.30 గం.లకు నలుగురు రేపిస్టులకు ఉరిశిక్షను అమలు చేశారు. అయితే దీనిపై చిలుకూరు బాలాజీ దేవాలయం ఆలయ అర్చకుడు రంగరాజన్ మాట్లాడుతూ ఈ రోజు నిజమైన దీపావళి అని నరకాసురుని ఎలా అయితే కాల్చారో అలాగే 20 అడుగుల రాపాసుర దిష్టిబొమ్మను మధ్యాహ్నం 12 గంటల తరువాత స్వామివారి దేవాలయం బయట కాల్చబోతున్నట్టు తెలిపారు.