సంగారెడ్డి ప్రభుత్వ దవాఖాన దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలో మంగళవారంనాడు ప్రభుత్వ దవఖానలో చోరీకి గురైన పసిపాప ఆచూకీ లభ్యం కాకపోవడంతో పాప తల్లిదండ్రులతో పాటు.. డిసిసి అధ్యక్షరాలు నిర్మలా జగ్గారెడ్డి వారికి మద్దతుగా ధర్నాకు దిగారు. పాప తప్పిపోయి 24 గంటలు కావస్తున్నా ఇప్పటికీ పాప ఆచూకీ లభ్యం కాకపోవడంపై పోలీసులపై మండిపడ్డారు. అయితే సీసీ కెమెరాలు సరిగా పని చేయకపోవడం వలన పాప ఆచూకి ఆలస్యమవుతున్నట్లు పోలీసుల తెలిపారు.